సొంత వ్యాపారానికి బెస్ట్ స్కీం..!
– ట్రైనింగ్‌లోనే రోజుకు ఉచితంగా రూ. 500లు
– ఆ తరువాత రూ. 3 లక్షల వరకు లోన్
– ఎవరు అర్హులు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : సొంతంగా బిజినెస్ చేసుకోవాలనే వారికి కేంద్రం బెస్ట్ స్కీం అమలు చేస్తోంది. చేతి వృత్తులపై ఆధారణ పడిన వారు ఈ పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. సంప్రదాయ చేతి వృత్తుల వారిని, హస్తకళాకారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తూ, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు చేస్తోంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 1న ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు రకరకాల వృత్తులు చేపడుతూ, కేంద్రం నుంచి ఉచితంగా రూ.15,000 మనీ, అలాగే అవసరమైన రుణం కూడా తీసుకోవచ్చు. ఇలా ఇప్పటికే కేంద్రానికి కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. 4 లక్షల మందికి పైగా మనీ తీసుకున్నారు. మిగతా వారి అప్లికేషన్ల పరిశీలన జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
అర్హులు ఎవరంటే..?
దేశంలో కమ్మరులు, స్వర్ణకారులు, వడ్రంగులు, శిల్పులు, స్వర్ణకారులు, చెప్పులు కుట్టేవారు, బుట్టలు, చాపలు, చీపుర్లు తయారు చేసేవారు, దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు, పూలదండలు తయారు చేసేవారు, చర్మకారులు, రజకులు, ఆయుధాలు తయారు చేసేవారు, చేతి వృత్తుల హస్త కళాకారులు వంటి 18 కేటగిరీలలో పని చేస్తున్న వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారులు ఆయా ప్రాంతాలలో మీసేవ కేంద్రాలు లేదా గ్రామపంచాయతీ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
డబ్బులు ఎలా ఇస్తారంటే..?
పైన చెప్పుకున్న వృత్తుల వారంతా అర్హులే. వారి వయస్సు 18 ఏళ్లు దాటి ఉండాలి. అప్లై చేసుకునేవారు ప్రస్తుతం ఆ పని చేస్తూ ఉండాలి. చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఏ కులానికి సంబంధించిన వారైనా సరే, ఈ పథకానికి అర్హులు. పీ.ఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్యం మెరుగుదల కోసం 7 రోజుల నుండి 15 రోజుల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు పొందిన లబ్ధిదారులకు రుణ సహాయం కింద రెండు విడతలుగా మొత్తం రూ. 3 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని, మొదటి విడత కింద 1 లక్ష రూపాయలు, రెండవ విడత కింద మిగతా రూ. 2 లక్షల రూపాయలను అందించడం జరుగుతుంది. లబ్దిదారులు రాయితీ వడ్డీ రేటు కేవలం 5శాతంపై రుణ సదుపాయం పొందవచ్చు. వృత్తి దారులు తమ పని కోసం గత ఐదేళ్లలో ఇలాంటి ఇతర పథకాల్లో రుణం తీసుకొని ఉండకూడదు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉండేవారు, వారి కుటుంబ సభ్యులూ ఈ పథకానికి అనర్హులు.
ఎలా అప్లై చేసుకోవాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in/Login లోకి వెళ్లాలి. అక్కడ మొబైల్ నంబర్, కాప్చా కోడ్ (captcha code) ఎంటర్ చెయ్యాలి. తర్వాత ఆధార్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఓ రిజిస్ట్రేషన్ ఫారమ్ వస్తుంది. దాన్ని నింపి, సబ్‌మిట్ కొట్టాలి. తర్వాత మీకు డిజిటల్ రూపంలో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత మీరు రూ.15000 పొందడం, రుణం పొందడం వంటివి చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి…

