ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– వైద్య శిబిరంలో కార్మికులకు పరీక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యం విషయంలో అందరు శ్రద్ధ వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు, సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్మికులతో పాటు ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర కీలకమైందని అన్నారు.
కార్మికుల ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుందున్నారు. కార్మికులు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ, మేనేజర్, ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

