సామాజిక సేవకు ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

సామాజిక సేవకు ప్రాధాన్యం
– వాసవీ మహిళ సంఘం ప్రమాణ స్వీకారం
– అభినందించిన మున్సిపల్ చైర్ పర్సన్, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందని తాండూరు వాసవీ మహిళ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ ఓపెన్ ఆడిటోరియంలో వాసవి మహిళ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షురాలుగా కోట్రిక కుటుంబానికి చెందిన కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలుగా గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శురాలుగా మంకాల స్వప్న, సహా కార్యదర్శురాలుగా తాళ్లపల్లి కవిత. కోశాధికారిగా సింగంశెట్టి శోభతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన కార్యవర్గ సభ్యులను మున్సిపల్ చైర్ పర్సస్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, సభ్యులు మాట్లాడుతూ ఆర్య వైశ్య మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా సామాజిక సేవకు ప్రాధాన్యమిస్తామన్నారు. వాసవి మహిళ సంఘం కీర్తి పెంచేలా అందరి సహాకారంతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, పెద్దలు, పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!