ఉచిత కోచింగ్ విద్యార్థులకు వరం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఉచిత కోచింగ్ విద్యార్థులకు వరం
– ముస్లిం వెల్ఫేర్ చేయూత అభినందనీయం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో ఫ్రీ ఈఏపీ సెట్, ఎంసెంట్ కోచింగ్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు వరంగా మారుతాయని తాండూరు మున్సిప చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని అసోసియేషన్ కు చెందిన కొత్త భవనంలో నూతన ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై నేతలు, అసోయేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఉన్నత చదువులకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ సెంటర్‌ సేవలు వరంగా ఉంటాయన్నారు.

విద్యార్థుల కోసం ముస్లిం వెల్ఫేర్ అసోయేషన్ ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచితంగా అసోసియేషన్ అందిస్తున్న సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. 35 రోజుల పాటు కోచింగ్ సెంటర్ కొనసాగుతుందన్నారు.

కోచింగ్ సెంటర్ నిర్వహణ కోసం చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రూ. 2లక్షల ఆర్థిక సాయం. అందించారని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా రూ. 2లక్షల సాయం అందిస్తామని చెప్పారని తెలిపారు. గతంలో కూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు కూడా సహాకారం అందించారని తెలిపారు. ఈ కోచింగ్ సెంటర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరోవైపు మంగళవారం ప్రారంభించిన కోచింగ్ సెంటర్ కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. భారీ ఎత్తున దరఖాస్తులను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్ రాము, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, ఖలీలుల్లా షరీఫ్, కార్యదర్శి ఖాలేద్ సైఫుల్లా, సభ్యులు సయ్యద్ భాసిత్ అలీ, సాబేర్, ఖయ్యూం, సలీం, సిరాజుద్దీన్, సాజిద్, అధ్యాపకులు రామకృష్ణ, ప్రియాంక, తులసీదాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు