సంబ‌రంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

– జెండా ఆవిష్క‌రించిన చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ఆగ‌స్టు 15 (ద‌ర్శిని) : తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలో మువ్వ‌న్నెల జెండా రెప‌లాడింది. ఆదివారం తాండూరు ప‌ట్ట‌ణంలోని గాంధీచౌక్ వ‌ద్ద నిర్వ‌హించిన స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌లో మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ హాజ‌రై జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అంత‌కుముందు గాంధీ విగ్ర‌హానికి పూజ‌లు నిర్వ‌హించి నివాళులు అర్పించారు.


అనంత‌రం మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరు అంబేద్క‌ర్ పార్కులో నిర్వ‌హించిన వేడుక‌ల‌లో చైర్ ప‌ర్స‌న్ జెండాను ఆవిష్క‌రించారు. అదేవిధంగా మున్సిప‌ల్ కార్యాల‌యంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డితో క‌లిసి చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ మువ్వ‌న్నెల జెండాను ఎగుర‌వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్, మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు, టీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ ఫ్లోర్ లీడ‌ర్లు, కౌన్సిల‌ర్లు, ఆయా పార్టీల ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.