తుక్కుగూడ సెంటిమెంట్ రీపీట్..!
– పార్లమెంట్లో హస్తం గెలుపు ఖాయం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– కార్యకర్తలతో బస్సులో తుక్కుగూడకు ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తుక్కుగూడ సెంటిమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రీపీట్ అవుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన జన జాతర సభకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులో నేతలు బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ జెండాను ఊపి బస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల సభ కలిసొచ్చిందన్నారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలో నిర్వహిస్తున్న జన జాతర సభ కలిసోస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆర్టీసీ బస్సులో తుక్కుగూడ సభకు తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్* చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, నాయకులు డా.సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్ పరిమళ, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

