గెలుపు గాలి బీజేపీ వైపే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గెలుపు గాలి బీజేపీ వైపే..!
– చేవేళ్లలో 3లక్షల మేజార్టీ ఖాయం
– మళ్లీ ప్రధానీ మోడీకి యువత జై
– మోసం చేసిన రంజిత్ రెడ్డికి గుణపాఠం
– చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ వైపే గెలుపు గాలీ వీస్తోందని ఆ పార్టీ నాయకులు, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని వెంకోబా గార్డెన్లో యాలాల మండల బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రకు మంచి స్పందన లభించిందన్నారు.

ఏ గ్రామానికి వెళ్లినా బీజేపీ అంటూ అందరు మద్దతు ఇస్తున్నారని అన్నారు. మూడో సారి మళ్లీ మోడీ ప్రధాని కావాలని యువత జై కొడుతున్నారని అన్నారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో గెలుపు గాలి బీజేపీ వైపే వీస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 3 లక్షల మెజార్టీ ఖాయమన్నారు. ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.

అప్పట్లో కాంగ్రెస్ నేతలకు కూడా మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరి రంజిత్ రెడ్డికి సొంత పార్టీ నుంచి గడ్డుకాలం ఉందన్నారు. ఆయనకు గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, సీనీయర్ నాయకులు నాగారం సర్సింలు, ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మాజీ ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, మాజీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు: గాజుల శాంతుకుమార్, కౌన్సిలర్ సాహు శ్రీలత, మండల, తాండూరు పట్టణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆదర్శనీయుడు అంబేద్కర్‌