తల్లి, అక్క మందలించారని ఘోరం
– క్వారీ గుంతలో పడి వ్యక్తి ఆత్మహత్య
– వివరాలు వెల్లండించిన ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తల్లి, అక్క మందలించారని జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి కార్వీ గుంతలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం తాండూరు. మండలం మల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అక్కంపల్లి అంజిలప్ప (26) ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ విషయంలో ఏదైనా పనిచేసుకోమని తల్లీ, అక్క గత కొన్నిరోజులుగా చెబుతున్నారు. దీంతో తల్లీ. అక్కతో అంజిలప్ప గొడవ పడి నాకు ఏదైనా చెబితే చనిపోతానని బెదిరించేవాడు.
తాజాగా మరోసారి తల్లీ, అక్క మందలించడంతో జీవితంపై విరక్తి చెందిన అంజిలప్ప గ్రామ శివురులో ఉన్న ఓ క్వారీ గుంతలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు 100కు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు తెలుసుకుని కుటుంభీకులకు సమాచారం అందించారు. అంజిలప్ప మృతి విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు అందించినట్లు ఎస్ఐఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇదికూడా చదవండి…

