విద్యుత్ వినియోగదారులకు అలెర్ట్..!
– సమస్యలపై ఫిర్యాదులకు అవకాశం
– తాండూరు విద్యుత్ అధికారుల వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్ విద్యుత్ వినియోగదారులకు అధికారులు అలెర్ట్ ప్రకటించారు. ఆదివారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తాండూరు సబ్ డివిజన్ కార్యాలయంలో 9:00 గంటలకు వినియోగదారులతో సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందిని చెప్పారు. ఈ సమావేశంలో విద్యుత్ వినియోగదారులు దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులపై తమ పిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

