ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..!
– బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదాం
– కాసానికి భారీ మెజార్టీ అందించాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– నియోజకవర్గ నాయకులతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరు పనిచేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో తాండూరు పట్టణం, తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల ముఖ్య నాయకులతో వేరువేరుగా సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో తాండూరు ప్రాంతాలకు ఒరిగేమిలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు అందరు కృషి చేయాలన్నారు.

త్వరలో ప్రతి ఊరికి వస్తానని, రచ్చబండవాడ కాంగ్రెస్ పార్టీ మోసాలను వివరించాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై పోస్టు కార్డు ఉద్యమం చేపడుదాం అని పిలుపునిచ్చారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణ ఇంకా తగ్గలేదన్నారు. ఎన్నికల్లో ఎస్సీ, ఎసీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పోరాడిన బీఆర్ఎ స్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు భారీ మెజార్టీ అందించేలా కృషి చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి, వికారాబాద్. జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు పటేల్ ఉమాశంకర్. రాజప్ప గౌడ్. శకుంతల. రాంలింగారెడ్డి, శంషోద్దీన్, కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మజ్జిగ పంపిణీ సేవ అభినందనీయం