రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం
– బషీరాబాద్ ఎంపీపీ కుటుంబ సభ్యుడుగా గుర్తింపు
– దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. రైల్వే పట్టాలపై వ్యక్తి మృతదేహాం లభించిన సంఘటన కలకలం రేపింది. మృతుడు బషీరాబాద్ ఎంపీపీ కరుణ, అజయ్ ప్రసాద్ కుటుంబ సభ్యుడుగా గుర్తించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఎంపీపీ కరుణ భర్త అజయ్ ప్రసాద్ పెద్ద అన్న అమర్ ప్రసాద్ కుమారుడు బబ్లూ ప్రసాద్(36) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైనట్లుగా స్థానికులు చెబుతున్నారు.
అయితే బుధవారం ఉదయం బషీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని గూడ్స్ రైలు వెళ్లే పట్టాలపై బబ్లూ ప్రసాద్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ సంఘటన ఎంపీపీ కుటుంబంలో విషాదం నింపింది.
ఇదికూడా చదవండి…

