మమ్మేలూ.. దుర్గమ్మ తల్లీ
– తాండూరులో శోభాయానమంగా నవరాత్రి ఉత్సవాలు
– అమ్మవారికి పూజలు నిర్వహించిన రాజుగౌడ్, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అమ్మా.. భవానీ.. లోకాలనేలా.. దుర్గమ్మ తల్లీ.. అంటూ భక్తులు శక్తి స్వరూపిణిని కొలుస్తున్నారు. తాండూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయామానంగా కొనసాగుతున్నాయి. బుధవారం తాండూరు పట్టణంలోని బసవణ్ణకట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలని, అందరిని సల్లంగా చూడాలని వేడకునన్నారు. మరోవైపు సాయంత్రం వేళ టీఆర్ఎస్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
రక్తదాతలను అభినందించిన రాజుగౌడ్
మరోవైపు బసవణ్ణకట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాత ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న రాజుగౌడ్ రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. పండగతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొని రక్తదానం చేసిన యువతను రాజుగౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, యువనాయకులు బిర్కడ్ రఘు, శివానంద్, ఉత్సవ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.