కారు గుర్తును మరువొద్దు..!
– కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు
– కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకుందాం
– ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తల్లీ ప్రమోదిని రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును మరువకుండా ఓటేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతంలో ప్రమోదిని రెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా సర్సింలుతో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం అందించిన బీఆర్ఎస్ అందించిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పాతరేస్తుందని విమర్శించారు. బీజేపీ వల్ల మనకు జరిగేందేమి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ సు గెలిపించుకునేందుకు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్లోళ్ల నర్సింలు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

