కాంగ్రెస్‌ బహిరంగ సభ వాయిదా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌ బహిరంగ సభ వాయిదా..!
– 10వ తేదినే తాండూరుకు ప్రియాంక గాందీ
– హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి
– ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో జరగాల్సిన కాంగ్రెస్ బహిరంగ సభ వాయిదా పడింది. ఈ సభను ఈనెల 10వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ అదే రోజు తాండూరుకు విచ్చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు సోమవారం తాండూరులో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

విలియమూన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శురాలు ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతారని ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల బహిరంగ సభ నిర్వహణ తేదిలో మార్పు చేశారు. ఈనెల 10న అదే విలియమూన్ గ్రౌండ్ లో నిర్వహించాలని తేది ఖరారు చేశారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విలియమూన్ గ్రౌండ్ ను సందర్శించారు. బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా హెలీప్యాడ్ స్థలాన్ని కూడా పరిశీలించారు.

10న నిర్వహించే సభకు భారీగా జన సవి కరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా నాయకులు ఉత్తమ్ చంద్, జిల్లా మహిళ అధ్యక్షురాలు శోభారాణి, మహిపాల్ రెడ్డి, ఉప్పరి మల్లేశం, కొమ్ము గోపాల్ రెడ్డి, బంటు మల్లప్ప, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రవి, భీం సింగ్, వెంకన్న తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కారు గుర్తును మరువొద్దు..!