జాతరలా టీజేఎస్ ప్రచారం..!
– దద్దరిల్లిన డప్పుల దరువులు
– 34వ వార్డులో ఆకట్టుకున్న ప్రచారం
– ముందుండి నడిపించిన సోమశేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కూటమి నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గురువారం తాండూరు పట్టణంలో టీజేఏస్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని జాతరలో నిర్వహించారు. పట్టణంలోని 34వ వార్డులో టీజేఏస్ ఇంచార్జ్, వార్డు కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో డప్పుల దరువుల మద్య ప్రచారం చేపట్టారు. రంజిత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆట పాటలతో చైతన్య పరిచారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలపై అవగాహన కల్పించిన తీరు ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారం చేపడితే మార్పు తీసుకవస్తుందన్నారు. మతం పేరుతో ఓట్లు అడిగే పార్టీలను నమ్మొద్దన్నారు. బీజేపీ హాయాంలో పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెరగడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. మార్పు సాధ్యమయ్యే కాంగ్రెస్ పార్టీకి అందరు ఓటేయాలని విజ్ఞప్తి చేశార. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు ఆదిత్య, వెంకటేష్, జగదీష్, నర్సింలు, బలరాం, వార్డు మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

