పాపాత్ముడు ఈ ప్రవీణ్‌..!

క్రైం తెలంగాణ హైదరాబాద్

పాపాత్ముడు ఈ ప్రవీణ్‌..!
– కల్లు కోసం దారుణ హత్యలు
– జైలుకెళ్లోచ్చిన మారని బుద్ది
– సైకో కిల్లర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఈ సైకో కిల్లర్ ఎంత పాపాత్ముండంటే.. వరుస హత్యలు చేసినా ఏమాత్రం పశ్చాతాపం పడలేదు. పైగా చంపేశాను.. ఏం చేద్దాం అంటూ గడుసు సమాధానం ఇచ్చాడు. హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తోన్న ఓ భిక్షగాడిని.. చిరువ్యాపారిని దారుణంగా చంపిన ఈ కేసులో సైబరాబాద్‌ పోలీసులు మిస్టరీ చేధించారు. మైలార్‌దేవ్‌ పల్లిలో జంట హత్యలు వాడి పనేననే మిస్టరీ రివీల్‌ చేశారు సైబారాబాద్‌ పోలీసులు. ప్రవీణ్‌ అనే నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారి నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. పుట్‌పాత్‌లు, దారి పక్కన నిద్రించేవారి వద్దకు వెళ్లి వారి పక్కనే పడకున్నట్లు నటించి వీలు చూసుకుని రాయితో అటాక్ చేసి.. డబ్బుతో పరారావుతాడని పోలీసుల విచారణలో తేలింది. డబ్బు కోసం ఎందుకైనా ఎందాకైనా తెగించే సైకో నేచర్‌ ప్రవీణ్‌ది. కల్లు తాగడమే వాడి లక్ష్యం. ఫుట్‌పాత్‌లపై పడుకునే వాళ్లే వాడి మార్గం. 500 అవసరం అనిపిస్తే ఓ హత్య చేసేస్తాడు. రాళ్లతో కొట్టి చంపి వాళ్ల దగ్గరున్న డబ్బు తీసుకొని కల్లు తాగుతాడు. మైలార్‌దేవ్‌పల్లిలో ఇద్దరు అమాయకులను చంపేశాడు. అంతకన్నా ముందు ఇదే తరహాలో బుద్వేలు అనే వ్యక్తి హత్య జరిగింది. అది కూడా వీడి పనే. కల్లు తాగినంత ఈజీగా ప్రాణాలు తీస్తాడు ప్రవీణ్‌. పాత కేసుల్లో చాలాకాలం జైలులో ఉన్నాడు. 8 నెలల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయినా కూడా బుద్ది మార్చుకోలేదు. మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన డబుల్‌ మర్డర్‌ కేసులో కూపీలాగితే.. గతంలో ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో ప్రవీణ్‌ పైశాచికం ఏ రేంజ్‌లో వుందో వెలుగుచూసింది. సైకోనా.. లేదంటే పక్కా పథకంతోనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నాడా? ఇంత జరిగినా అతనిలో ఎలాంటి పాశ్చాతాపం లేదు. చంపేశా.. అయిపోయింది.. ఇప్పుడేం చేద్దాం అని సమాధానం ఇచ్చాడు. మళ్లీ బయటకు రాకుండా కఠిన శిక్ష పడేలా చూస్తామని సైబరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి….

తాత తడబడలేదు..!

chaithany collage