భ‌క్తుల‌ను దీవించు దుర్గ‌మ్మ త‌ల్లి..!

తాండూరు వికారాబాద్

భ‌క్తుల‌ను దీవించు దుర్గ‌మ్మ త‌ల్లి..!
– అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో పూజించే భ‌క్తుల‌ను స‌ల్లంగా దీవించాల‌ని తాండూరు వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్ అమ్మ‌వారిని వేడుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇందిరాన‌ర‌గ్‌లో శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా భ‌వానీ మాత ఆల‌యం వ‌ద్ద‌ ప్ర‌తిష్టించిన దుర్గామాత‌ను ద‌ర్శించుకున్నారు. గురువారం మండ‌పంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అన‌త‌రం భ‌క్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం కోసం రూ.11000 ఆర్థిక సాయం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్ మాట్లాడుతూ ప్ర‌తి యేడాది అమ్మ‌వారి ఆశీస్సులు పేద‌ల‌పై ఉండాల‌ని, అంద‌రు సుఖ‌సంతోషాల‌తో జీవించేలా అమ్మ‌వారి దీవెను ఉండాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాలాల‌ ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, కౌన్సిలర్ బోయ ర‌విరాజు, హమాలీ సంఘం అధ్యక్షులు భీమప్ప, ప్రధాన కార్యదర్శి బాలప్ప,బద్రు,అశోక్,శ్రీను హమాలీ కార్మికులు పాల్గొన్నారు.