ప్రాణాలు కాపాండండి..!
– కుక్కుల బెడద నియంత్రించండి
– బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం
– తాండూరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలను భయాందోళన కలిగిస్తున్న కుక్కుల నుంచి ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు. కుక్క దాడిలో 5నెలల బాలుడు మృతి చెందడంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులపై దాడి చేస్తున్న కుక్కుల ఘటనలపై మండిపడ్డారు. బుధవారం తాండూరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్క దాడిలో 5నెలల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. పలు ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా తిరిగి చిన్నారులపై దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. చిన్నారుల ప్రాణాలు కోల్పోతుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కుక్కుల బెడద నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కల స్వైర విహారం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదికూడ చదవండి…

