అట్టహాసంగా ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
– జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు
– ఎమ్మెల్సీ నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలను తాండూరులో అట్టహాసంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదినాన్ని పురష్కరించుకుని పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, అల్పహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్, సుమిత్‌గౌడ్‌లతో కలిసి పండ్లు, అల్పహారం పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ ఎంపీ రంజిత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్‌ను కట్ చేశారు. నేతలు ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌తో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజకీయంతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల పెన్నిధిగా నిలుస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు దక్కించుకుని అందరి మనస్సుల్లో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు
సాయిపూర్ బాల్‌రెడ్డి, మసూద్, గడ్డలి రవిందర్, జుబేర్ లాల, బంటు మల్లప్ప, బోయరాజు, కౌన్సిలర్లు ప్రవీణ్‌గౌడ్, వెంకన్నగౌడ్, రవిరాజు, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, రొంపల్లి సంతోష్‌కుమార్, పట్టణ అధ్యక్షులు రాకేష్ తాండ్ర, ఎర్రం శ్రీధర్, అశోక్, టైలర్ రమేష్, అంబ్రేష్, శివానంద్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
