చైర్‌ పర్సన్ కారుకు ప్రమాదం

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్


చైర్‌ పర్సన్ కారుకు ప్రమాదం

– స్వల్ప గాయాలతో అందరు సేఫ్‌
– జోగిపేట వద్ద ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు కుటుంభీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అలసేం జరిగిందంటే… ఇటీవలే చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ నిజాంపేట్‌లోని తన పుట్టినిళ్లుకు వెళ్లింది. మంగళవారం తన కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. కారులో చైర్ పర్సన్‌ స్వప్న పరిమళ్‌తో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు.

మార్గ మద్యలోని జోగిపేట్ పరిధిలోని గడి పెద్దాపూర్ వద్దకు రాగానే వారికి ఎదురుగా వస్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో చైర్ పర్సన్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుకు అనుకుని ఉన్న రేయిలింగ్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు తెరచుకోవడంతో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కూతురు, కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జోగిపేట్ పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

వైశ్య ఫెడరేషన్ సేవ భేష్..!