పాదయాత్ర భక్తులకు మెడికల్ కిట్ల పంపిణీ
– 100 మందికి అందజేసిన రఘునందన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా బయల్దేరిన శివ భక్తులకు తాండూరుకు చెందిన యువనాయకులు పట్లోళ్ల రఘునందన్ రెడ్డి మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. గురువారం మార్గమద్యలోని నాయినోనిపల్లి వద్ద రఘునందన్ రెడ్డి ఆ గ్రామ సర్పంచ్ చిన్న చెన్నారెడ్డితో కలిసి దాదాపు 100 మందికి గ్లూకోండి గ్లూకోజ్, వాటర్ బాటిల్, బిస్కట్ ప్యాకెట్లు, మెడిసిన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రగా బయల్దేరిన భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ పూర్ మాధవరెడ్డి, బస్వరాజ్ చంద్రశేఖర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

