పేద జీవితానికి భరోసా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
పేద జీవితానికి భరోసా..!

– తోపుడు బండి అందించి ఉపాధి
– వైశ్య ఫెడరేషన్, ఆర్యవైశ్య సంఘం గొప్ప మనసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదరికంలో జీవిస్తున్న కుటుంబానికి వైశ్య ఫెడరేషన్, తాండూరు ఆర్యవైశ్య సంఘం భరోసా అందించింది. ఆ కుటుంబం జీవనోపాధి పొందేందుకు సంపూర్ణ చేయూతనందించి గొప్ప మనసును చాటుకుంది. సంఘాలు చాటిన సేవా నిరతిని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అభినందించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు ఆర్యవైశ్య సంఘానికి చెందిన మేడిశెట్టి బాలరాజ్ వికలాంగుడు. పేదరికంలో జీవిస్తున్న అతను ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విషయం తెలుసున్న వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యూత్ కార్యదర్శి, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి రొంపల్లి సంతోష్‌ కుమార్ బాలరాజ్‌కు చేయూత అందించాలని వైశ్య ఫెడరేషన్, ఆర్యవైశ్య సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తోపుడు బండి పెట్టించాలని నిర్ణయించారు. ఇందుకు సంఘం సభ్యులు పెండ్యాల అశోక్ కుమార్(ఫుడ్ క్యాటరింగ్ ) బాలరాజ్ కోరిక మెరకు కొత్త తోపుడు బండి, వ్యాపార సామాగ్రిని ఇప్పించేందుకు ముందుకు వచ్చారు. దీంతో బాలరాజ్ కుటుంబానికి తోపుడు బండి, సామాగ్రిని అందజేసి నూతన వ్యాపారాన్ని ప్రారంభింప చేయించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ వైశ్య ఫెడరేషన్, ఆర్యవైశ్య సంఘం అందించిన సేవను అభినందించారు. ఈ సందర్బంగా సంఘాల సభ్యులు మాట్లాడుతూ సంఘంలో ఇంకా పేద ఆర్యవైశ్యులకు 0ఎవరికైనా సహాయం చేయదలచుకుంటే మా దృష్టికి తీసుకరావాలని, అర్హులైన వైశ్యులతో పాటు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాహు శ్రీలత, ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోడూరు వినోద్, ఉపకార్యదర్శి కుంచం సంపత్, కార్యవర్గ సభ్యులు పోలా వీరన్న, కల్వ ఉదయ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సర్కారు బడిలో నాణ్యమైన విద్య..!