గ్రూపు-1కు అంతా రెడీ..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrగ్రూపు-1కు అంతా రెడీ..!
– తాండూరులో నాలుగు సెంటర్లు
– హాజరుకానున్న 1488 మంది అభ్యర్థులు
– కట్టుదిట్టమైన బందోబస్తు : డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షలకు అధికారులు అంతా సిద్ధం చేశారు. గ్రూపు-1 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సింధూ డిగ్రీ కాలేజీ, సింధూ బాలికల జూనియర్ కళాశాల, సిద్దార్థ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో మొత్తం 1488 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

మరోవైపు తాండూరులో నిర్వహిస్తున్న గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలపై తనతో పాటు పట్టణ సీఐ. రూరల్ సీఐల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎస్ఐ, కానిస్టేబుళ్ల బందోబస్తు ఉంటుందన్నారు. అదేవిధంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవ్వరు కూడా గుంపులుగా గుమిగూడవద్దని సూచించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఆన్ లైన్ కేంద్రాలను మూసి ఉంచాలన్నారు.

ఇదికూడా చదవండి…

పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి