ఈద్ ముభార‌క్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrఈద్ ముభార‌క్‌..!
– ఘనంగా బక్రీద్
– ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : త్యాగనిరతిని చాటే బక్రీద్ పర్వదినాన్ని తాండూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఈద్-ఉల్-జుహా సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెన్గేష్ పూర్ రోడ్డు మార్గంతో పాటు ఖాంజాపూర్ గేటు సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు.

దీంతో ఈద్గా వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా మత ప్రవక్తలు మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకుంటామని తెలిపారు. ఆ త్యాగాన్ని అందరు మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బక్రీద్ పండగ సందర్భంగా చెన్గేష్ ప్పూర్ రోడ్డుమార్గంలోని ఈద్గా వద్ద జరిగిన వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్‌ పటేల్, పలువురు నాయకులు హాజ‌రై ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌, సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, బంటు మల్లప్ప, రవీందర్, కౌన్సిలర్లు ప్రవీణ్‌ గౌడ్, రాము, ఈద్గాకమిటి చైర్మన్ యూసుఫన్, పలు పార్టీల నాయకులు, పట్టణ ప్రముకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఉన్నారు. మరోవైపు బక్రీద్ పండగలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

ఇదికూడా చదవండి…

లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి