శాంతి, సామరస్యతకు ఏసు ప్రతిరూపం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– రాజీవ్ కాలనీలో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతి, సామరస్యతకు ఏసు ప్రతిరూపం అని.. ఆయన మార్గాన్ని అనుసరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలోని నజరేతు చెర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెర్చ్ పాసర్లు జాకబ్, అశోక్కుమార్లు మహేందర్ రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం వారు మహేందర్రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీ సీబీ జిల్లా డైరెక్టర్ రవిందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్రెడ్డి, కౌన్సిలర్ వెంకన్నగౌడ్, జిల్లా కోఆప్షన్ ఫోరం నాయకులు శంషోద్దీన్, కాలనీ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.
