మాదక ద్రవ్యాలు వెరీ డేంజర్..!

క్రైం తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

chai jrమాదక ద్రవ్యాలు వెరీ డేంజర్..!
– డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– పోలీసు శాఖ ఆధ్వర్యంలో యాంటి డ్రగ్ డే
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాదక ద్రవ్యాల వినియోగం మానవ సమాజానికి భయంకర పరిస్థితులను తీసుకవస్తాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం(యాంటీ డ్రగ్ డే) నిర్వహించారు. పట్టణ సీఐ సంతోష్‌ కుమార్, రూరల్‌ సీఐ అశోక్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు.

పలు కళాశాలల విద్యార్థులకు యాంటీ డ్రగ్ డే పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో వివరించారు. వాటికి బానిసలు కావడం వల్ల తల్లిదండ్రులపై దాడులు, స్నేహితులతో గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయన్నారు. మత్తు పదార్థాల వినియోగం ప్రమాదకరమన్నారు.

యువత వీటికి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం పట్టణంలోని పుర వీదుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై అవగాహన కల్పించారు.

ఇదికూడా చదవండి…

ట్రైన్‌లో కొత్త రూల్స్‌..!