లింక్‌ పంపి లూటీ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrలింక్‌ పంపి లూటీ..!
– ఈకేవైసీ పేరుతో బురిడీ
– ఖాతాలో లక్షల నగదు మాయం
– తాండూరు పట్టణంలో ఘటన
– బాధితుడు ఏం చేశాడంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : సాంకేతికను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు క్రైంలకు పాల్పడుతున్న సంఘటనల గురించి కొకొల్లలుగా వింటూనే ఉంటాం. అయినా కూడా చదువున్న వారే బాధితులుగా మారుతున్నారు. తాజాగా వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ బాధితుడు సైబర్ నేరగాడి వలలో చిక్కుకుని ఖాతాలో నుంచి లక్షలు పోగొట్టుకున్నాడు.

పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని గుమాస్తానగర్‌కు చెందిన చామకూర ప్రవీణ్ కుమార్ ప్రైవేటు టీచర్ పనిచేస్తున్నారు. అయితే గత మార్చ్ 6న తన సెల్ ఫోన్లో ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదును బదిలీ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి సెల్: 8945841371 నుంచి కాల్ చేసి యూనియన్ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ లింక్ పంపినట్లు తెలిపారు. దీనికి వివరాలు తెలపాలని కోరగా అతను లింక్ను ఓపెన్ చేశాడు. వెంటనే అతని ఖాతా నుంచి రూ. 4లక్షల 6వేల 087లు లూటీ అయ్యాయి.

దీంతో బాధితుడు ప్రవీణ్ కుమార్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయడంతో ఆన్ లైన్ లో అతని ఫిర్యాదును నమోదు చేసుకోవడం జరిగిందని సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు అంటూ కేవైసీ అప్డేట్ చేయాలని ఎవరైనా ఫోన్ చేస్తే అలాంటి కాల్స్ కి స్పందించవద్దని సూచించారు. ఒకవేళ సైబర్‌ నేరగాళ్ల బారినపడి మోసపోతే వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని, లేదా ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి సూచించారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో కొత్త చట్టాల అమలు