ప్రజాసేవే ధ్యేయంగా సాగాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజాసేవే ధ్యేయంగా సాగాలి..!
– లయన్స్ క్లబ్ సామాజిక సేవ భేష్
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా గోల్డెన్ జూబ్లీ, ప్రమాణ స్వీకార వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజాసేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తూ ముందుకు సాగాలని తాండూరు ఎమ్మేల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని ఎంపీటీ హాల్లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన సమక్షంలో తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త, ప్రధాన కార్యదర్శిగా గాజుల వరప్రసాద్, కోశాధికారిగా మహమ్మద్ అసద్ అలీ, ఉపాధ్యక్షులుగా మురళీ మోహన్, మల్లెపల్లి మధుసూదన్, మహమ్మద్ యూసుప్, కోఆర్డినేటర్ యెడ్రామి బసనప్ప, జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో బతడానికి అందరు డబ్బులు సంపాదిస్తారని, సంపాదించన సొమ్ములో సామాజిక సేవ చేయడం కొందరికే తెలుస్తుందన్నారు.

సేవారంగంలో లయన్స్ క్లబ్ సమాజ సేవకు ప్రతిరూపంగా నిలుస్తుందని అభివర్ణించారు. విద్యా, వైద్య రంగాలతో పాటు సామాజిక సేవలో ముద్రవేసిందన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా లయన్స్ క్లబ్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని, ప్రస్తుతం తాండూరు అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చిలుకవాగును ప్రక్షాళన చేస్తున్నామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో కోడంగల్, తాండూరు జంట నగరాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మరోవైపు కార్యక్రమంలో వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ జయప్రసాద్, డాక్టర్ సంపత్ కుమార్ లను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ ఎన్.ఎన్. మూర్తి, రీజియన్ చైర్మన్ అశోక్ యాదవ్, లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రూల్స్ నెగ్లెట్‌ చేస్తే నేరస్తులే..!