మున్సిపల్ కమీషనరుగా విక్రమ్ సింహ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్ కమీషనరుగా విక్రమ్ సింహ రెడ్డి
– ఉత్తర్వులు జారీ చేసి మున్సిపల్ శాఖ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కమీషనరుగా విక్రమ్ సింహారెడ్డి నియామకం అయ్యారు. ప్రస్తుతం వనపర్తి మున్సిపల్ కమీషనరుగా పనిచేస్తున్న ఆయనను తాండూరు మున్సిపల్ కమీషనరుగా బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కమీషనరుగా ఉన్న షఫీవుల్లాపై స్పష్టత లేదు. ఆయనను వేయిటింగ్‌లో ఉంచినట్లు సమాచారం. ఈయన గత యేడాది జులైలో బాధ్యతలు స్వీకరించారు. షఫీవుల్లా ఎక్కడ పనిచేసినా ఆరు నెలలకు మించి పనిచేయరని శాఖలో రికార్డు ఉంది. తాండూరులో కూడా ఆరు నెలలకు మించే పనిచేశారు. ప్రస్తుతం కమీషనరుగా వస్తున్న విక్రమ్ సింహారెడ్డి గతంలో తాండూరులో శానిటరీ ఇనుస్పెక్టరుగా పనిచేశారు.

 

 

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!