సేవతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు

తాండూరు రాజకీయం వికారాబాద్

సేవతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు
– ఐదేళ్ల సేవతో మెప్పించడం గొప్ప విషయం
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
-నియోజకవర్గ మాజీ ప్రజా ప్రతినిధులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సేవా కార్యక్రమాలతో ప్రజా ప్రతినిధులకు గుర్తింపు సాధ్యమవుతుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఐదేళ్ల పదవి కాలాన్ని ఇటీవలే పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీలుగా మారిన ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

తాండూరు పట్టణంలోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులను శాలువాతో సత్కరించి మెమెంటోలను అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు అభివృద్ధి, సేవా కార్యక్రమాలతోనే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ఐదేళ్లు పదవి బాధ్యతలు పూర్తిచేసుకోవడం గొప్ప విషయమన్నారు. పదవులు మాత్రమే సేవకు మార్గం కాదని, పదవులు లేకున్నా ప్రజా క్షేత్రంలో సేవ చేయొచ్చన్నారు. ఉత్తమ సేవలు అందిస్తే మళ్లీ పదవులు పొందవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, రాష్ట్ర నాయకులు పి.శ్రీశైల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ప్రమోదిని రెడ్డి, గౌడి మంజుల వెంకటేశం, మున్సిపల్ మాజీ చైర్ పర్సస్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, మాజీ ఎంపీపీలు ఆనురాధ రమేష్, బాలేశ్వర్ గుప్త, శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు స్వరూప వెంకట్రామ్ రెడ్డి. అన్నపూర్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయ్ కుమార్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సీనీయర్ నాయకులు రాజప్ప గౌడ్, పటేల్ ఉమాశంకర్, రాంలింగారెడ్డి, రమేస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, బీఆర్ఎస్ మహిళ కన్వీనర్ శకుంతల దేశ్ పాండే, అనురాధ రవీందర్, మాజీ ఎంపీటీసీలు సాయిరెడ్డి, శాంతు, రాజమణి. సుశీలమ్మ వెంకటేష్, పత్తిబాయి, మాజీ కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, నాయకులు ఆర్సీ గౌడ్, మేతరి ప్రకాశం, గౌడి వెంకటేశం, తలారీ యాదప్ప, కేశవరావు, ప్రతాప్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్, కుర్వ నాగార్జున, హసన్ పటేల్, శేరి విజయేందర్ రెడ్డి, పెండా మహేందర్, పలు గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

చేతగాని సర్కారు..!