పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం
– జూనియర్ కార్యదర్శుల బదిలీలకు అవకాశం
– స్పష్టం చేసిన అధికారులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ నుంచి మరో పంచాయతీలకు బదిలీ చేశారు. వీరితో పాటు త్వరలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా బదిలీ చేసే అవకాశం ఉందని అధికార యంత్రాంగంలో ప్రచారం జరుగుతోంది. మండలంలోని అంతారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇస్మాయిల్ మల్కాపూర్ కు, మల్కాపూర్ గ్రామ పంచాయతీ మోన్యా నాయక్ యాలాల మండలం రాఘవపూర్ పంచాయతీకి, వీరారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి కిష్టప్ప బండమీది పల్లి గ్రామ పంచాయతీకి బదిలీపై వెళ్లారు.
అదేవిధంగా బిజ్వార్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణను ఇతర జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో కొత్త పంచాయతీ కార్యదర్శులు కూడా నియామకం అయ్యారు. అంతారం పంచాయతీ కార్యదర్శిగా వీరప్ప, వీరారెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శిగా రవీందర్ లు నియామకం అయ్యారు. ఈనెల 20వ తేది తరువాత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు పంచాయతీ కార్యదర్శుల బదిలీలతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలోని దాదాపు 11 మంది జూనియర్ పంచాయతీ కార్యదరు లను త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇదికూడా చదవండి…

