జుంటుపల్లి జాతరకు ఏర్పాట్లు చేయండి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రూ. 20లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జుంటుపల్లి రామస్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నేతలు, అధికారులతో కలిసి ప్రారంభించారు.

అంతకుముందు దేవాలయంలో సీతారామ స్వాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఉత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జాతర ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు భీమప్ప, హన్మంతు ముదిరాజ్, చంద్రేశేఖర్ గౌడ్, తిమ్మాయిపల్లి రాజు, ఆలయ కమిటి చైర్మన్ శ్యాం సుందర్ రావు, రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాఘవేంద్రరావు, హనుమంతరావు, డా. రవీందర్ రావు, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

