మనసున్న చేయూత..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మనసున్న చేయూత..!
– 427 మంది విద్యార్థులకు ష్యూస్, నోటు బుక్స్, ప్లేట్ల పంపిణీ
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల సేవలో మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ మరోసారి మంచి మనసును చాటుకుంది. శుక్రవారం బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 427 మంది విద్యార్థులకు స్కూల్ బూట్లు, నోటు పుస్తకాలు, స్టీల్ పేట్లను పంపిణీ చేసింది. మార్వాడి యువమంచ్ కు చెందిన బంకట్ లాల్ నందకిషోర్ పర్తాని ఆర్థిక సాయంతో మండలంలోని కోర్విచేడ్, కోర్విచేడ్ గని ప్రాథమిక పాఠశాలలో 125 మంది విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆశారాం లక్ష్మీనివాస్ సార్డా చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని గంగ్వార్ ప్రాథమిక పాఠశాలలో 17 మందికి, క్యాద్గీరా, జీవన్గీలో బాలికల, మండల పరిషత్ పాఠశాలలో 170 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సీళ్లు, షాఫ్ నర్స్ పంపిణీ చేశారు.

అంతేకుండా మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో మధు పసారి, సునీల్ సార్ధా, నిహార్ సోమాని, రోహిత్ అగ్రవాల్ ల ఆర్థిక సాయంతో జీవన్గీలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 115 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు శాఖ అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠీ తదితరులు మాట్లాడుతూ గత 35 ఏండ్లుగా మార్వాడి యువమంచ్ విద్యార్థులకు చేయూతనందిస్తుందని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచ్ కోశాధికారి అరుణ్ సార్డా, పవన్ సోని, దినేష్ పర్తాని, సంజయ్ సార్డా, ఆశిష్ సార్డా, క్రిష్ణ బూబ్, అంకిత్ సార్డా, భరత్ దేవ్‌డా, అభిషేక్ అగ్రవాల్, పీఆర్టీయూ బషీరాబాద్ మండల అధ్యక్షులు రామనర్సింహారెడ్డి, శ్రీధర్ రెడ్డి, జీ. విజయ్ కుమార్, ఆయా గ్రామాల పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పాహిమాం.. శాకాంబరీ మాత..!