శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
– పట్టణ ఎస్ఐగా అబ్దుల్ రవూఫ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందని పట్టణ నూతన ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ అన్నారు. శనివారం పట్టణ ఎస్ఐ 1గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ గిరి, ఎస్ఐ సతీష్లు బదిలీపై వెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఎస్ఐ గిరి వికారాబాద్ ఆఫీసులో రిపోర్టు చేశారు. మరో ఎస్ఐ సతీష్ నియోజకవర్గంలోని పెద్దేముల్ ఎస్ఐగా బదిలీపై వెళ్లారు. ఎస్ఐ గిరి స్థానంలో కొన్ని రోజుల క్రితమే అరవింద్ బాధ్యతలు చేపట్టారు. శనివారం ఎస్ఐ సతీష్ స్థానంలో అబ్దుల్ రవూఫ్ బాధ్యతలు చేపట్టారు. తాండూరు పట్టణంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈ ఇద్దరు ఎస్ఐలకు తాండూరులోనే ఎస్ఐలుగా మొదటి పోస్టింగ్ లభించింది. ఎస్ఐ అరవింద్ గతంలో పెద్దేముల్, యాలాల పోలీస్ స్టేషన్లలో ట్రైనింగ్ పూర్తి చేయగా.. అబ్దుల్ రవూఫ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ పూర్తి చేశారు. శనివారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
