రేపు తాండూరు బంద్..!
– పురవీధుల్లో నిరసన యాత్ర
– ప్రకటించిన హిందూ ఐక్య వేధిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో రేపు స్వచ్ఛంద బంద్ నిర్వహించాలని నిర్ణయింయారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాండూరు హిందూ ఐక్యవేదిక ప్రకటించింది. ఇందుకు తాండూరులోని వ్యాపారస్తులు, సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. అదేవిధంగా పరిస్థితులు జరుగుతున్న నరమేధాన్ని ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకు గంజిలోని రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి శాంతియుత ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. తాండూరు బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

