అతిథి గృహంపై పట్టింపు ఏది..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అతిథి గృహంపై పట్టింపు ఏది..!
– ఐబీ బంగ్లాను ఆధునీకరించాలి
– తాండూరు బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అతిథిగృహంపై పాలకులకు, అధికారులకు పట్టింపు కరువైదంటూ బీజేపీ నేతలు విమర్శించారు. సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అతిథి గృహాన్ని నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్లుగా అతిథి గృహాన్ని పూర్తి చేయకుండా వదిలేశారని అన్నారు. ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోకపోవడంతో అతిథిగృహం అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. ఏండ్లుగా నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేయడం పట్ల అతిథిగృహంపై ఉన్న శ్రద్ద తేలిసిపోయిందన్నారు.

ఇప్పటి కైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అతిథిగృహాన్ని ఆధునీకరించి అందుబాటులోకి తీసుకరావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, మంతటి రాజు, ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, జిల్లా ఎస్సీ మోర్చ్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు నరేష్, ఎక్స్ ఆర్మీ ప్రభాకర్ రెడ్డి, శివ. శరణప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భక్తుల ఇంటికి మల్లికార్జున స్వామి