ఎల్లుండి హిందూ ఉత్సవ సమితి సమావేశం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎల్లుండి హిందూ ఉత్సవ సమితి సమావేశం
– ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 25న తాండూరు హిందూ ఉత్సవ సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే రాబోతున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని సమావేశం ఉంటుందని చెప్పారు. ఎల్లుండి ఆదివారం ఉదయం 10-30 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య ఏసీ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి సమితి ప్రతినిధులు, హిందూ బందువులు, సంఘాల నాయకులు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

రైతుల కోసం దర్నాకు బీఆర్ఎస్‌ సిద్దం