సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
– పాత ఫించన్ విధానాన్నే అమలు చేయాలి
– ముక్త కంఠంతో మున్సిపల్ ఉద్యోగుల డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీపీఎస్ వద్ద.. ఓపీఎస్ ముద్దు అంటూ తాండూరు మున్సిపల్ ఉద్యోగులు  నినాదాలు చేశారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు శుక్రవారం తాండూరు మున్సిపల్ లో సీపీఎస్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానం(ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్ ను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు రాములు, నర్మద, యాదగిరి, సతీష్ కుమార్, బిల్ కలెక్టర్లు నాగేందర్, కపిల్ కుమార్, సీనీయర్ అసిస్టెంట్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనకు ఐకేపీ, కాంట్రాక్టు ఉద్యోగులు సంఘీభావం తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఎల్లుండి హిందూ ఉత్సవ సమితి సమావేశం