సై.. అన్న తాండూరు..!
– పురవీధుల్లో ఖుషీగా సైక్లోథాన్
– జాలీగా పాల్గొన్న విద్యార్థులు, యువత, పెద్దలు
– ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన
– ఆకట్టుకున్న మార్వాడి యువమంచ్ కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించేందుకు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి తాండూరు వి ద్యార్థులు, యువత, పెద్దలు, చిన్నారులు సైతం సై అంటూ సైకిలింగ్ కు జై కొట్టారు. జాతీయ క్రీడా దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత మార్వాడి యువమంచ్ పిలుపు మేరకు దేశంలోని 800 శాఖలతో సైకిలిస్థులతో సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహించారు. తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరులో సైక్లోథాన్ కార్యక్రమం చె పెట్టారు.
తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి జెండా ఊపీ ర్యాలీ ప్రారంభించారు. తాండూరు పురవీధుల్లో సైక్లోథాన్ యాత్ర ఖుషీగా.. జాలీగా.. కొనసాగింది. పట్టణంలోని గంగోత్రి వి ద్యాలయ స్కూల్ కు చెందిన 150 మంది విద్యార్థులతో విలియమూన్ చౌరస్తా, ఇందిరా చౌరస్తా, గంజ్, గాంధీ చౌక్, మార్వాడీ బజార్, పటేల్ భగీచా మీదుగా గగ్రాణీ ఫంక్షన్ హాల్ వరకు చేరుకుంది. పట్టణ పురవీధుల్లో ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కల్పిస్తూ ప్లకార్డులతో పాటు నినాదాలు చేస్తూ సాగిన సైకిల్ యాత్ర అందరిని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన డా. సమీవుల్లా మాట్లాడుతూ క్రీడలు, వ్యాయామాలతో పాటు సైకిలింగ్ ద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. అదేవిధంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్థా మాట్లాడుతూ సేవ్ ఎర్త్. సేవ్ ఎన్విరాల్ మెంట్, సేవ్ హెల్త్ ను దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్లుగా సైక్లోథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. అందుకే సైకిలింగ్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం సైకలింగ్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మార్వాడి యువమంచ్ అధ్యక్షులు ఆనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్డా, కుంజ్ బిహారి సోని, సన్ని అగ్రవాల్, బ్రిజ్ మోహన్ బూబ్, ఆశిష్ సార్డా, కిషన్ రాఠీ, అభిషేక్ అగ్రవాల్, స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

