ధరణి ఫోర్టల్‌పై సమగ్ర నివేధిక ఇవ్వండి
– సర్కారుకు ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశం
– నాలుగు వారాల గడువు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేధిక అందించాలని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్సీ) సర్కారును ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల్లో పూర్తి వివరాలను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించింది. భూ సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనిలో సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో పెద్ద సంఖ్యలో భూములు ఉన్నాయని, తద్వారా చట్టబద్ధమైన రైతులు తమ భూములను కొనుగోలుదారులకు విక్రయించే హక్కును నిరాకరించారని.. “ఇది భారీ స్కామ్ కాబట్టి నేను ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసినట్లు బక్క జడ్సన్ తెలిపారు. ధరణిలోని సమస్యలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారని, కొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. ధరణి వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ధరణి పోర్టల్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది.
