మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా మట్టి వినాయకుల పంపిణీ
– వరధ బాధితులకు ఫౌండేషన్ రూ. 1 లక్ష వెయ్యి విరాళం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి పూజించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని నెహ్రు గంజ్ ఆవరణలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై మట్టి వి నాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.
పండగలో మట్టి వినాయకులను ప్రతిష్టించాలని, పర్యావరణ హిత గణనాథులనే పూజించాలన్నారు. రసాయనాలతో తయారు చేసిన గణనాథులను ప్రతిష్టించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. వాటిని నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, వాగులు కలుషితమవుతాయని అన్నారు. కావున మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడమే శ్రేష్ఠమని అన్నారు. పర్యావరణ హితం కోసం ఫ్రెండ్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవను అభినందించారు.
అదేవిధంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు ఇటీవల కురిసిన వర్షాలతో బాధపడుతున్న వరధ బాధితుల కోసం రూ. 1 లక్ష 1 వెయ్యిని ఎమ్మెల్యేకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఠాకూర్ తుల్జరాం సింగ్, దాత పాలది శ్రీనివాస్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, వ్యాపారులు కల్వ రాధాకృష్ణ, కట్కం వీరేందర్, సల్లా దామోదర్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

