దళిత యువకుడి కిడ్నాప్‌..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దళిత యువకుడి కిడ్నాప్‌..!
– ఆపై దాడి చేసి హత్యాయత్నం
– నిందితులను శిక్షించాలని కేవీపీఎస్ డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ దళిత యువకున్ని కిడ్పాప్‌ చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ యాలాల మండలం ఎనికెపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు నట్టల మనోహర్‌ను అదే గ్రామంలోని అగ్రకులానికి చెందిన బీటి రాజేందర్, బీటి మహేందర్, భాస్కర్ గౌడ్, చెలుక బాలరాజ్, రాము, శ్రీనివాస్‌లను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా మనోహర్‌పై కట్టెలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారని అన్నారు. మనోహర్ దెబ్బలకు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మ హత్య యత్నంకు పాల్పడినట్లు తెలిపారు.

ఈ విషయంపై బీటి రాజేందర్, బీటీ మహేందర్‌లను కుటుంబ సభ్యులు మా కొడుకును ఎందుకు కొట్టారని అడిగితే మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అని, మాకు అన్ని తెలుసు అన్నారని తెలిపారు. అంతేకాకుండా ఫోన్ చేసి బెదిరిపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత యువకున్ని కిడ్నాప్ చేసి దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన నిందితుల పై చట్టపరమని చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పకీరప్ప, దస్తప్ప, అనంతప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

ఆరోగ్య శాఖలో కొలువులు..!