రేపు ఎల్లుండి భారీ వ‌ర్షాలు

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

బంగాళాఖాతంలో అల్పపీడనం..
– రేపు ఎల్లుండి భారీ వ‌ర్షాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతార‌ణ శాఖ తెలిపారు. శ‌నివారం వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రా – దక్షిణ ఒడిస్సా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింద‌ని వెల్ల‌డించారు. ఈ అల్పపీడనానికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం 5.8 కి.మీ ఎత్తున కొనసాగుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ ప్రభావంతో ఈ నెల 31 వరకు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని తెలిపారు. హైదరాబాద్‌లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షం వచ్చే అవకాశం ఉంద‌ని, 29, 30 న తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది.