కల్లు సోసైటీ సేవపై కడుపుమంటెందుకు..!
– గీతకార్మికులకు ప్రోత్సహాం అందించడం తప్పా
– ఎమ్మెల్యే తోడ్పాటుపై తప్పుడు ప్రచారం తగదు
– కల్లు గీతా సోసైటి అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గీతా కార్మికులకు కల్లు సోసైటీ ద్వారా సేవ చేస్తే కడుపు మంట ఎందుకు కలుగుతోందని తాండూరు సోసైటీ అధ్యక్షులు సంగెం మేఘనాథ్ గౌడ్, సభ్యులు మండిపడ్డారు. తాండూరుకు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఓ మీడియా సమావేశంలో కల్లు సోసైటీ ద్వారా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో గీతా కార్మికులకు ప్రోత్సహాకం అందించడం పట్ల వాఖ్యలు చేయడాన్ని ఖండించారు. కల్లు సోసైటీలో యాభై ఏండ్లుగా డబ్బులు పంచే సంస్కృతి లేదని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంప్రదాయం తీసుకరావడం పట్ల రాజుగౌడ్ అభ్యంతరం తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్లు సోసైటీలోని గీత కార్మికులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకరావడం జరిగిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. గౌడ కులంలో ఉండి గౌడ సోదరులకు ప్రోత్సహాకాలు అందిస్తుంటే సంతోషపడాల్సింది పోయి అవమానకరంగా మాట్లాడడం పద్దతి కాదన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో గీత కార్మికులకు రూ.3వేల ప్రోత్సహాకాలతో పాటు చనిపోయిన కుటుంబాలకు రూ. 5వేల సాయం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు… ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

