పైలెట్ నీతులు నమ్మరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ నీతులు నమ్మరు..!
– అభివృద్ధి అంతా మోసమే
– నాలుగేళ్ల ఆటంకాలు తెలియనివా..?
– విద్వేశంతోనే చీఫ్‌ విప్, ఎమ్మెల్యేపై విమర్శలు
– ఎమ్మెల్యే కృషితో పట్టణ అభివృద్ధి పరుగులు
– నీతివంత పాలనే సోదరుల ధ్యేయం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి పేరుతో మోసం చేసిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వల్లించిన నీతులను ఎవ్వరు నమ్మె స్థితిలో లేరని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సోదరుడు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ప్రభుత్వంపై పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన విమర్శనలను ఆమె ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రెడ్డి తాండూరు అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌ పార్టీలో చేరినట్లు చెప్పిన సంగతి అందరికి గుర్తే. కాని ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా రోహిత్ రెడ్డి తాండూరు పట్టణ అభివృద్ధికి ఎలాంటి శ్రద్ద చూపలేదన్నారు.

అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అభివృద్ధి పేరుతో అంతా మోసమే చేశారని అందరికి అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని చేసిన విమర్శలు విద్వేశపూరితమే అని కొట్టిపారేశారు. తాండూరులో నీతివంతమైన పాలనతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఓర్వలేని తనంతో వాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. తాండూరులో ఏండ్లుగా పరిష్కారం కాని పనులను ప్రారంభించడంతో పాటు ప్రతి వార్డులో పార్టీలకతీతంగా పనులు మంజూరు చేయిస్తున్నారని అన్నారు. దీంతో మనోహర్ రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ దక్కుతుందన్నారు. అదేవిధంగా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండడంతో పాటు తాజాగా రాష్ట్ర విఫ్‌ బాధ్యతలు తీసుకున్ననేపథ్యంలో ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరులో ఇసుక రవాణా నియంత్రణకు చొరవ చూపారని అన్నారు. ప్రభుత్వానికి ఆధాయం వచ్చే విధంగా చేశారని అన్నారు. అంతేకాకుండా పార్టీ నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ నీతివంతమైన పాలనే అంధించడమే ధ్యేయంగా పనిచేస్తున్న నేతలపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. పైలెట్ వల్లిస్తున్న నీతి మాటలను ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరని, శాంతియువత రాజకీయాలను భగ్నం చేసే కుట్రలను ఎవ్వరు ఉపేక్షించరని అన్నారు.

ఇదికూడా చదవండి…

 

మహిసాసుర మర్ధిణిగా వాసవీ మాత..!