టీఆర్ఎస్‌ది చిత్తశుద్ది లేని పాలన
– బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో టీఆర్ఎస్ చిత్తశుద్దిలేని పాలన కొనసాగిస్తుందని బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఏండ్లుగా తాగునీటి సమస్య ఉన్న దాని పరిష్కారానికి చర్యలు తీసుకునే పాలకులు కరువు అయ్యారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం సర్కారు చిత్తశుద్ధి ఏపాటితో అందరికి అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వర్గపోరును పక్కన పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముట్టడికి సిద్దమవుతామని హెచ్చరించారు.



