డిజిటల్ ఆర్సీలు వస్తున్నాయ్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

డిజిటల్ ఆర్సీలు వస్తున్నాయ్..!
– ఎలక్ట్రానిక్ లైసెన్సులు కూడా
– వాహనదారులకు ఆ ఇబ్బందులు తప్పినట్లే
– రాష్ట్రాల్లో అమలుకు కసరత్తును చేస్తున్న కేంద్రం
దర్శిని డెస్క్ : చిన్న వాహనాల నుంచి భారీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు(ఆర్సీ)లు తప్పనిసరి. వాటిని నడిపేవారికి కూడా డ్రైవింగ్ లైసెన్స్‌లు ముఖ్యం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అందరికి స్మార్ట్ కార్డులను అందిస్తున్నారు. అయితే స్మార్ట్ కార్డుల స్థానంలో త్వరలో డిజీటల్‌ రూపంలో మార్చేందుకు కేంద్రం దృష్టిసారిస్తోంది. దీంతో స్మార్ట్ కార్డులకు స్వస్తి పలికి డిజిటల్ కార్డులను అందజేస్తారన్నమాట.

ఈ నిర్ణయం ఎందుకు అంటే..?
2023- 2024 మధ్య, ఢిల్లీ రవాణా శాఖ మే వరకు 1.6 లక్షల డ్రైవింగ్ లైసెన్స్‌లు, 6.69 లక్షల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ) పంపిణీలో జాప్యం జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో గతంలో రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం సమీక్షిస్తున్నారు. స్మార్ట్ కార్డ్ వ్యవస్థను డిజిటల్ రూపంలోకి మార్చడమే లక్ష్యం. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై సరైన నిర్ణయానికి వస్తే ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు మాత్రమే జారీ చేస్తారు. ఈ కొత్త కార్డులను ఆధార్ కార్డు వలె జారీ చేసే అవకాశం ఉంది. వాటిని ఉపయోగించడం సులభం అవుతుంది.

ప్రయోజనాలు
దీని కింద క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ చేసుకునే సదుపాయం ఉన్న ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్‌లో డాక్యుమెంట్ల పీఈఎఫ్‌ ఫార్మాట్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, సంబంధిత లింక్‌లు దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు అందుతాయి. తద్వారా వారు తమ పత్రాలను సులభంగా సేకరించవచ్చు. ఎలక్ట్రానిక్ కార్డులు ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీని కింద దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్ ప్రింట్ చేసినట్లుగా పత్రాలను స్వయంగా ముద్రించుకోవచ్చు. ఈ కార్డ్‌లకు ప్రత్యేకమైన ID, QR కోడ్ ఉంటాయి. వీటిని ట్రాఫిక్ పోలీసులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు. రవాణా శాఖ అధికారి ప్రకారం, ఈ ఎలక్ట్రానిక్ పత్రాలను డిజిలాకర్ లేదా mParivahan యాప్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. దీనితో ప్రజలు తమ పత్రాలను చూపించడంలో ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోరు. అలాగే ఈ పని చాలా సులభం అవుతుంది. అయితే రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదికూడా చదవడి…

ట్రైన్ రిజర్వేషన్‌ రూల్స్‌లో మార్పులు..!