గర్జించిన హిందువులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గర్జించిన హిందువులు..!
– బంగ్లాదేశ్‌లో దాడులపై భగ్గు
– తాండూరులో నిరసన ర్యాలీ విజయవంతం
– పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు
– సబ్‌ కలెక్టర్‌కు మెమొరెండం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : బంగ్లాదేశ్‌లో హిందూవులపై జరుగుతున్న దాడులపై తాండూరు హిందూవులు గర్జించారు. దాడులను అరికట్టే తీరాలని భగ్గుమన్నారు. బుధవారం తాండూరు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆద్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపం నుంచి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో తాండూరు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అయ్యప్ప స్వామి భక్తులు, హిందు సంఘాల నాయకులు పాల్గొన్నారు. భద్రేశ్వర దేవాలయం నుంచి శాంత్ మహాల్ చౌరస్తా, ఇందిరా చౌరస్తా, నెహ్రు గంజ్‌ మీదుగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. పురవీధుల్లో హిందూవుల నినాదాలు మార్మోగాయి.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో స్వామీజీలపై, హిందువులపై మత మౌడ్యంతో దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. అమాయక హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణచి వేయాలన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగించేలా చూడాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, గీతా సత్సంగ్ సమితి, ఇతర హిందూ సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో తాండూరులో నిరసన ర్యాలీ విజయవంతం అయ్యింది.

ఇదికూడా చదవండి…

అన్నదాన సత్రానికి అంకురార్పణ