చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– గౌతమిలోఖోఖో స్టేట్ మీట్ టోర్నమెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం గౌతమి మాడల్ స్కూల్లో అండర్-17 ఖోటో స్టేట్ మీట్ టోర్నమెంట్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. టోర్నమెంట్ కు హాజరైన విద్యార్థులతో కరచాలనం చేస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఇలాంటి టోర్నమెంట్ లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికితీసే అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకు పీఈటీలు కృషి చేయాలన్నారు. టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులు సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, గౌతమీ స్కూల్ కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

