పేదల విద్యకు పెద్దపీట..!
– ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చారిత్రాత్మకం
– తాండూరులో కాంగ్రెస్ పార్టీ నేతల హర్షం
– సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల విద్యార్థుల చదువుకు కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేస్తుందని తాండూరు నేతలు అన్నారు. తాండూరు నియోజకవర్గంకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం పట్ల ఆదివారం తాండూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హర్షాతిరేకాలు వ్యక్తం చె శారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిత్రపటాలకు డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, పి.బస్వరాజ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బషీరాబాద్ నాయకులు అజయ్ ప్రసాద్ తదితరులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో ఎస్సీ, ఎసీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం తాండూరులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం వల్ల నియోజకవర్గంలోని అయా వర్గాల విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. అందరికి ఆధునిక సాంకేతిక వసతులతో కార్పోరేట్ స్థాయి విద్య అందుతుందన్నారు. ఇందుకు చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డికి, కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి, ప్రవీణ్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్. మాజీ వైస్ చైర్మన్ అలీం, అక్బర్ బాబ, బాతుల వెంకటయ్య, బాతుల నగేష్. బాతుల భీంశంకర్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి….

